ప్రభాస్ కోసం రూట్ మార్చిన సందీప్ వంగా.. రెబల్స్ కి పూనకాలు పక్కా

ప్రభాస్ కోసం రూట్ మార్చిన సందీప్ వంగా.. రెబల్స్ కి పూనకాలు పక్కా

Published on Jun 19, 2026 1:30 AM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రాల్లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ స్పిరిట్ కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఇదిలా వుండగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తోంది.

మామూలుగా సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ గాని ఫ్యాన్ స్టఫ్ లాంటిది చాలా తక్కువ. ఒక ఫ్లోలో కథనంకి తగ్గట్టు వెళ్ళిపోతుంది. కానీ దీనికి కొంచెం భిన్నంగా రూట్ మార్చినట్టు తెలుస్తోంది. దీని ప్రకారం ప్రభాస్ కోసం ఒక క్రేజీ ఇంట్రో సాంగ్ ని సిద్ధం చేయిస్తున్నట్టు తెలుస్తోంది. అసలే ప్రభాస్ ఇందులో పోలీస్ రోల్.

పైగా మన టాలీవుడ్ లో స్టార్స్ తాలూకా పోలీస్ రోల్స్ ఇంట్రో సాంగ్స్ కి సెపరేట్ రీచ్ ఉంది. సో ఈ ఫార్మాట్ లో స్పిరిట్ ఇంట్రో సాంగ్ ఫ్యాన్స్ కి పూనకాలు ఇచ్చే లెవెల్లోనే ఉండొచ్చు. ఇక ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు