స్పిరిట్ : ఆ విషయంలో సందీప్ రెడ్డి నిజంగా తోపే..!

స్పిరిట్ : ఆ విషయంలో సందీప్ రెడ్డి నిజంగా తోపే..!

Published on Aug 22, 2026 8:00 AM IST

Spirit

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా సినిమా ‘స్పిరిట్’ షూటింగ్ ఇప్పటికే 50 రోజులు పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి కేవలం షూటింగ్ విశేషాలే కాకుండా, దర్శకుడు వంగా పాటిస్తున్న ఆర్థిక నియంత్రణ హాట్ టాపిక్ గా మారింది.

భారీ తారాగణం, భారీ బడ్జెట్ ఉన్న పెద్ద సినిమా అయినప్పటికీ, ఎక్కడా అనవసరపు ఖర్చులు లేకుండా ప్లాన్ ప్రకారం బడ్జెట్ పరిధిలోనే ప్రొడక్షన్ సాగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాధారణంగా స్టార్ హీరోల చిత్రాల షూటింగ్ సమయంలో భారీ సెట్లు, అనవసరమైన యాక్షన్ ఎపిసోడ్స్ వల్ల బడ్జెట్ అంచనాలను మించిపోతుంటుంది. కానీ వంగా మాత్రం స్క్రిప్ట్ డిమాండ్ మేరకే ఖర్చు పెడుతూ, కేవలం విజువల్స్ కోసం కాకుండా కథకు విలువ చేకూర్చే అంశాల మీదే పూర్తి దృష్టి పెట్టారు.

మిగిలిన షెడ్యూల్స్‌లోనూ ఇదే క్రమశిక్షణ కొనసాగిస్తే, భారీ అంచనాలున్న ‘స్పిరిట్’ సినిమా టాలీవుడ్‌లో బడ్జెట్ పరంగానూ ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది.

తాజా వార్తలు