అర్జున్ రెడ్డి కోసం సందీప్ మొదట సంప్రదించింది ఆ హీరోనే !

Published on Jun 3, 2019 3:27 pm IST

తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న ‘అర్జున్ రెడ్డి’ సినిమాను దర్శకుడు సందీప్ వంగ హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. టీజర్, ట్రైలర్ బాగుండటంతో ప్రేక్షకుల్లో సినిమాపై మంచి అంచనాలున్నాయి. అందరూ కబీర్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్ చాలా బాగా కుదిరాదని, అతనిపెర్ఫార్మెన్స్ గొప్పగా ఉందని అంటున్నారు. అయితే ఆ పాత్ర కోసం సందీప్ షాహిద్ కపూర్‌తో పాటు ఇంకో హీరోని కూడా సంప్రదించాడట.

అతనే అర్జున్ కపూర్. మొదటి నుండి ఈ ఇద్దరు హీరోల్లో ఎవరో ఒకరితో సినిమా చేయాలనుకున్న సందీప్ ఇద్దరితో ఒకేసారి సంప్రదింపులు జరిపి పలు చర్చల తర్వాత షాహిద్ కపూర్‌ను ఫైనల్ చేసుకుని సినిమా చేశారట. తాను ఆశించినట్టే షాహిద్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని అంటున్నారు సందీప్. కైరా అద్వానీ కథానాయకిగా నటించిన ఈ సినిమాను జూన్ 21వ తేదీన భారీ ఎత్తున విడుదలచేయనున్నారు.

సంబంధిత సమాచారం :

More