కంబ్యాక్ కి సిద్దమైన సంఘవి

కంబ్యాక్ కి సిద్దమైన సంఘవి

Published on Mar 13, 2015 8:27 AM IST

Sangavi
మీ అందరికీ సంఘవి గుర్తుందా.? ఈ పాపులర్ హీరోయిన్ 1990లలో అందరు స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసింది. అమరావతి, తాజ్ మహల్, సింధూరం, శివయ్య, సమరసింహారెడ్డి, లాహిరి లాహిరి లాహిరిలో లాంటి సినిమాలలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. సంఘవి హీరోయిన్ గానే కాకుండా లేడీ ఒరిఎంతెద్ సినిమాలు కూడా చేసింది. 2010 తర్వాత తను సినిమాలకు పూర్తి దూరంగా ఉంది.

చాలా కాలంగా సంఘవి సినిమాలకు మాత్రమే కాకుండా పబ్లిక్ అటేన్షన్ కి కూడా దూరంగా ఉంది. ఇప్పుడు ఈ భామ తన కంబ్యాక్ మూవీ కోసం సిద్దమవుతోంది. తాజా సమాచారం ప్రకారం సంఘవి తమిళంలో రానున్న ‘కలోంజి’ సినిమాలో ఓ ముఖ్య పాత్రచేయనుంది. ఈ మూవీ తనని తెలుగులోకి కూడా తీసుకు వస్తుందని పలువురు భావిస్తున్నారు. మరి తెలుగులో ఎవరు సంఘవికి అవకాశం ఇస్తారనేది చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు