లంగ్ క్యాన్సర్ తో బాధపడుతున్న సంజయ్ దత్!

Published on Aug 12, 2020 1:57 am IST

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ గత కొద్ది రోజుల క్రితం బ్రీతింగ్ ప్రోబ్లం తో ముంబై లోని లీలావతి ఆసుపత్రిలో లో చేరారు. అయితే సోమవారం నాడు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అనంతరం కాస్త విశ్రాంతి అవసరం అని భావించారు. అయితే యూ ఎస్ కి వెళ్లి అక్కడ మెరుగైన వైద్యం తీసుకుంటా అని, ఈ విషయం లో అభిమానులు, మీడియా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంజయ్ దత్ తెలిపారు.

అయితే ప్రస్తుతం బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మూడవ స్టేజ్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే సంజయ్ దత్ సన్నిహితులు, స్నేహితులు సైతం క్యాన్సర్ నుండి బయట పడగలారను ధీమా తో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం లో కాస్త కలతగా ఉన్నా, సంజయ్ మాత్రం బలంగా ఉన్నట్లు స్నేహితులు చెబుతున్నారు. అయితే సంజయ్ దత్ నటించిన సడక్ 2 చిత్రం ఆగస్ట్ 28 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్టీమ్ అయ్యేందుకు సిద్దంగా ఉండగా, మరొక క్రేజీ చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2 లో ఇంకా కొన్ని సన్నివేశాలు బ్యాలన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :

More