సంజయ్ దత్ బయోపిక్ గా తెరకెక్కిన ‘సంజు’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వంద కోట్లు కలెక్ట్ చేస్తూ సంచలనాలు సృష్టిస్తోంది. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ రోజుతో 167 కోట్లు మార్క్ ను చేరుకుందట.
వీక్ డేస్ లో కూడా కలెక్షన్స్ బాగున్నాయి. ఈ వారాంతానికి సంజు చిత్రం సులభంగా 200 కోట్ల మార్క్ ను చేరుకున్నేలా కనిపిస్తోంది. మరి ఎంత మొత్తం కలెక్ట్ చేస్తుందో చూడాలి ఎందుకంటే ఈ చిత్ర దర్శకుడైన రాజ్ కుమార్ హిరానీ గత చిత్రం ‘పీకే’ బాక్స్ ఆఫీసు వద్ద 300 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా సంజు తెలుగు సినిమాల నుండి పెద్దగా పోటీని ఎదురుకోకుండా ఎ సెంటర్స్ లో ఈ చిత్రం బాగా నడుస్తోంది.


