విడుదలకు ముందే రికార్డు సృష్టించిన సంజు !
Published on Jun 26, 2018 9:06 pm IST


బాలీవుడ్ యువ హీరో రణ్ బీర్ కపూర్ నటించిన తాజా చిత్రం సంజు. స్టార్ హీరో సంజయ్ దత్ జీవిత కథ తెరకెక్కిన ఈ చిత్రం భారీ స్థాయిలో బిజినెస్ చేసిందని సమాచారం . విడుదలకు ముందే ఈ చిత్రం సుమారు 230 కోట్ల రూపాయలను ఖాతాలో వేసుకుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ , డిజిటల్ , శాటిలైట్ హక్కుల రూపంలో ఇంత భారీ మొత్తాన్ని రాబట్టిందని సమాచారం . రణ్ బీర్ నటించిన గత చిత్రాలు ఏవి ఈ స్థాయిలో బిజినెస్ చేయలేదు. అయితే కేవలం సంజయ్ దత్ జీవితంలోని చీకటి కోణాలను కూడా ఈ చిత్రంలో చూపిస్తుండడంతో ఈ సినిమాకి ఇంత భారీ బిసినెస్ సాధ్యమైంది.

ఇక ఈ నెల 29 న విడుదల కానున్న ఈ చిత్రం ఫై తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు . ఇతర భాషల్లోకి అనువాదం లేకుండా నేరుగా హిందీ భాషలో మాత్రమే విడుదలవుతున్న ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టు కోవడం ఖాయం గా కనిపిస్తుంది .

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook