మొదటి రోజు న్యూ రికార్డ్ క్రియేట్ చేసిన సంజూ!
Published on Jun 30, 2018 3:54 pm IST

బాలీవుడ్ లో భారీ అంచనాల నడుమ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సంజూ. సీనియర్ నటుడు సంజయ్ దత్ బయోపిక్ అని అందరికి తెలిసిందే. ఇక రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన సంజూ చిత్రం మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్స్ ను అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 4000 థియేటర్స్ లో రిలీజైన సంజూ మొదటి రోజు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దర్శనమిచ్చింది.

ఇక మొదటి రోజు సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే మొత్తంగా సంజూ 34.75 కోట్లను వసూలు చేసింది. దీంతో 2018 లోనే ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా సంజూ చిత్రం నిలిచింది.
రేస్ 3 (29.17 కోట్లు), భాగీ 2 (25.10కోట్లు) తరువాత స్థానంలో నిలిచాయి. సంజయ్ పాత్రలో రన్ బీర్ కపూర్ అద్భుతంగా నటించి సినిమాకు ప్రాణం పోశాడు. డైరెక్షన్స్ లో రాజ్ కుమార్ హిరానీ మరోసారి తన టాలెంట్ ఏంటో నీరూపించుకున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook