మరో ప్రయోగం.. రీసెర్చ్ పూర్తి చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ !

Published on Apr 2, 2019 7:09 pm IST

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి తన మొదటి ప్రయోగాత్మక సినిమా ‘ఘాజీ’ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులను కూడా బాగా ఆకట్టుకున్నాడు. అయితే తన రెండో సినిమాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని హీరో పెట్టి సంకల్ప్ దర్శకత్వం వహించిన ‘అంతరిక్షం 9000 కెఎమ్ పిహెచ్’ మాత్రం ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. అయినప్పటికీ మొట్టమొదటి తెలుగు స్పేస్ థ్రిల్లర్ మూవీ అని మంచి పేరే వచ్చింది ఆ సినిమాకు.

కాగా సంకల్ప్ రెడ్డి మళ్లీ మరో టెక్నికల్ మూవీ కోసం కసరత్తులు చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం సంకల్ప్ తన మూడవ సినిమాని అంటార్కిటికాలో జరిగే పరిశోధనల నేపథ్యంలో తీయాలని నిర్ణయించుకున్నారట. దానికి సంబధించిన రీసెర్చ్ ను కూడా సంకల్ప్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :