300 మిలియన్ తో ఆగని “సంక్రాంతికి వస్తున్నాం” ర్యాంపేజ్!

300 మిలియన్ తో ఆగని “సంక్రాంతికి వస్తున్నాం” ర్యాంపేజ్!

Published on Mar 8, 2025 7:27 PM IST

విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన రీజనల్ ఇండస్ట్రీ హిట్ చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” కోసం తెలిసిందే. టైటిల్ కి తగ్గట్టుగానే సంక్రాంతి బరిలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ సంక్రాంతి సినిమాల్లో రెండో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచి టాలీవుడ్ లో సంచలన విజయం నమోదు చేసింది. ఇక థియేటర్స్ తర్వాత ఓటిటిలో రిలీజ్ కి కూడా ఈ చిత్రం వచ్చింది.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు జీ5 సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇక్కడ కూడా రికార్డు రెస్పాన్స్ ని కొల్లగొట్టిన ఈ సినిమా ఇపుడు ఏకంగా 300 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్రాస్ చేసి అదరగొట్టింది. ఇలా ఓటిటిలోకి వచ్చాక కూడా సంక్రాంతికి వస్తున్నాం ర్యాంపేజ్ నెక్స్ట్ లెవెల్లో కొనసాగుతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా దిల్ రాజు, శిరీష్ లు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు