సంతోష్ శోభన్ ఆశలు నెరవేరినట్టే

Published on Jun 1, 2021 3:00 am IST

హీరోగా సెటిలవ్వడానికి యువ నటుడు సంతోష్ శోభన్ చాలానే స్ట్రగులు అయ్యాడు. పలు ప్రయత్నాల తర్వాత ఆయనకు ‘ఏక్ మినీ కథ’ రూపంలో సక్సెస్ లభించింది. యువీ కాన్సెప్ట్స్ ఈ సినిమాను నిర్మించింది. మేర్లపాక గాంధీ కథతో కార్తీక్ రాపోలు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలై మంచి సక్సెస్ సాధించింది. సంతోష్ శోభన్ నటన ఆయన మిగతా సినిమాల కంటే ఇందులో చాలా మెరుగైంది. ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడ సంతోష్ శోభన్ పెర్ఫార్మన్స్ పట్ల ఇంప్రెస్ అయ్యారు.

దీంతో నిర్మాతల్లో అతనికి ప్రామిసింగ్ హీరో అనే పేరు ఏర్పడింది. చిన్న సినిమాలు చేయాలనుకునే నిర్మాతలు చాలామందికి సంతోష్ శోభన్ ఒక మంచి ఛాయిస్ అవుతాడనే నమ్మకం తెచ్చుకున్నారు. ఇదే అతనికి అవకాశాలు పెంచుతోంది. ప్రస్తుతం సంతోష్ శోభన్ మూడు సినిమాలు చేస్తున్నాడు. వాటిలో ఒకటి యువీ కాన్సెప్ట్స్ నిర్మాణంలో, ఇంకొకటి స్వప్న సినిమాస్, మరొకటి సుస్మిత కొణిదెల నిర్మాణంలో ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా ఇంకొన్ని నిర్మాణ సంస్థలు అతనితో చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. త్వరలోనే అతని చేతిలో ఇంకో రెండు మూడు కొత్త సినిమాలు చేరే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :