సంతోష్ శోభన్ దశ తిరిగినట్టే

Published on Jun 10, 2021 7:02 pm IST

ఇటీవల అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైన ‘ఏక్ మినీ కథ’ చిత్రం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో సంతోష్ శోభన్ హీరోగా ఆశించిన విజయాన్ని అందుకున్నాడు. నటుడిగా కూడ ప్రేక్షకులు, విమర్శకుల నుండి మంచి మార్కులు వేయించుకున్నాడు. దీంతో ఆయనకు ఆఫర్లు భారీగా పెరిగాయి. పెద్ద నిర్మాణ సంస్థలతో సినిమాలకు సైన్ చేశాడు. యూవీ క్రియేషన్స్, స్వప్న సినిమాస్ లాంటి సంస్థలతో సినిమాలు చేస్తున్నాడు. సినిమా ఆఫర్లు రావడం మాత్రమే కాదు ఆయన సినిమాల బిజినెస్ కూడ పెరిగింది.

సంతోష్ శోభన్ ప్రజెంట్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. షూటింగ్ కూడ మొదలైంది. ఇదొక కంప్లీట్ లవ్ ఎంటర్టైనర్. నెల రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేయాలనేది మారుతి ప్లాన్. దీన్నీ యూవీ సంస్థే నిర్మిస్తోంది. ఇది కూడ చిన్న బడ్జెట్ చిత్రమే. ఈ సినిమా మొదలై కొన్నిరోజులే అవుతోంది. ఇంకా పూర్తికాకముందే మంచి డీల్స్ వస్తున్నాయట. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడానికి మంచి అమౌంట్ ఆఫర్ చేస్తోందట. దీన్నిబట్టి సంతోష్ శోభన్ సినిమాల మార్కెట్ పెరిగిందనే అనుకోవచ్చు.

సంబంధిత సమాచారం :