సప్తగిరి హీరోగా ‘ఆరడుగుల బుల్లెట్’..?

సప్తగిరి హీరోగా ‘ఆరడుగుల బుల్లెట్’..?

Published on Jan 28, 2015 12:53 AM IST

sapthagiri
ప్రముఖ హాస్య నటుడు సప్తగిరి హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది అనే వార్త ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ అయ్యింది. శ్రేయాస్ మీడియా ఈ సినిమాను నిర్మించనుంది అని సమాచారం. ‘ఆరడుగుల బుల్లెట్’ అనే టైటిల్ రిజిస్టర్ చేయించారట. ఇండస్ట్రీ హిట్ సినిమా పవన్ ‘అత్తారింటికి దారేది’లో వీడు ఆరడుగుల బుల్లెట్ అనే పాట ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు అదే టైటిల్ తో ఓ సినిమా, అందులో కమెడియన్ హీరో అనగానే ప్రేక్షకులలో క్రేజ్ ఏర్పడింది.

దర్శకుడు మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమ కథా చిత్రమ్’తో సప్తగిరి వెలుగులోకి వచ్చాడు. తర్వాత మారుతి నిర్మించిన ‘లవర్స్’లో కీలక పాత్రలో నటించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. శ్రేయాస్ మీడియా కాంపౌండ్ తో సప్తగిరికి మంచి అనుబంధం ఉంది. అందువల్ల, ఈ సినిమా ఎలా ఉంటుందో అని అందరిలో ఆసక్తి కలిగింది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

తాజా వార్తలు