“గూడుపుఠాణి” మోషన్ పోస్టర్ అదిరిందండోయ్..!

Published on Jul 4, 2021 2:03 am IST

తెలుగులో హాస్యనటులుగా పరిచయమై చాలా మంది హీరోలుగా మారారు. అయితే చక్కని కామెడీ టైమింగ్‌తో తనకంటూ ప్రేక్షకుల్లో ఓ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్న నవ్వుల రారాజు సప్తగిరి కూడా ఇదే కోవలోకి వస్తారు. కమెడీయన్‌గా అనేక సినిమాలు చేసిన సప్తగిరి ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘సప్తగిరి ఎల్ఎల్‌బీ’ అనే సినిమాను చేశాడు. అయితే ఈ సినిమాలు కామెడీ జానర్‌లోనే తెరకెక్కించడంతో సప్తగిరి ఫేట్ కమెడీయన్‌గా ఉండిపోయింది తప్పా హీరోయిజానికి మారలేదు.

అయితే సప్తగిరి తాజాగా చేస్తున్న కొత్త సినిమా చూస్తుంటే ఈ సారి ఆయన ఫేట్ హీరోగా మారబోతుందేమోనని అనిపిస్తుంది. కే.ఎం.కుమార్ దర్శకత్వంలో “గూడుపుఠాణి” అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఏదో పురాతన ఆలయం తలుపులు తెరిచి, ఆలయంలోని రాతి స్థంభాల పక్కన నుంచి సప్తగిరి తొంగి చూస్తున్నట్టు అందులో ఉంది. అయితే టైటిల్‌ను బట్టి చూస్తుంటే ఏదో రహస్యాన్ని వెలికితీసే మాదిరిగా కథ ఉండొచన్న అభిప్రాయం ఏర్పడుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సప్తగిరి సరసన నేహా సోలంకి హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీనివాస్ రెడ్డి పారుపాటి, రమేశ్ కాటరాయ్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :