‘సర్కార్’ అక్కడ 24గంటలు ప్రదర్శింపబడనుంది !

‘సర్కార్’ అక్కడ 24గంటలు ప్రదర్శింపబడనుంది !

Published on Oct 28, 2018 6:46 PM IST

Sarkar5

విజయ్ నటించిన ‘సర్కార్’ విడుదలకు తమిళ ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అంతకంటే ఎక్కువగా కేరళ ప్రేక్షకులు ఈ చిత్రం ఫై ఆసక్తిని కనబరు స్తున్నారు. తమిళనాడు తరువాత విజయ్ కి కేరళలోనే ఎక్కువగా ఫ్యాన్స్ వున్నారు. ఇక ఈ సినిమా మొదటి రోజు కేరళలోని థియేటర్లలో ఏకంగా 8షోస్ పడేలా ప్లాన్ చేస్తున్నారు.

ఆల్రెడీ త్రిసూర్ జిల్లాలోని తాలికులం కార్తీక థియేటర్లో దీపావళి రోజు 24గంటలు ఈచిత్రాన్ని ప్రదర్శించడానికి పర్మిషన్ కూడా లభించింది. ఈచిత్రం మొదటి రోజు కలెక్షన్ల పరంగా అక్కడ కొత్త రికార్డు ను క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక తెలుగులోనూ ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదలకానుంది. నవంబర్ 6న సర్కార్ థియేటర్లలో సందడి చేయనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు