క్రేజీ రికార్డ్ సెట్ చేసుకున్న ‘సారంగ దరియా’ సాంగ్..!

Published on Aug 7, 2021 9:00 pm IST

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా క్లాసిక్ అండ్ రొమాంటిక్ మూవీస్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమా ‘లవ్ స్టోరీ’. ఈ సినిమా విడుదలకు ముందే పలు రికార్డులను సొంతం చేసుకుంటుంది. ఈ సినిమాలోని ‘సారంగదరియా’ సాంగ్ ఫుల్ పాపులారిటీనీ దక్కించుకుంటూ ఇన్ స్టంట్ హిట్‌గా నిలిచింది. సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాటను మంగ్లీ ఆలపించింది.

తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో మరో క్రేజీ రికార్డును సెట్ చేసుకుంది. అయితే ఇప్పటి వరకూ ఈ పాటకు యూట్యూబ్‌లో 300 ప్లస్ మిలియన్ వ్యూస్ దక్కాయి. అతి తక్కువ సమయంలో ఓ లిరికల్ వీడియోకు ఇంత ఆదరణ లభించడం సౌత్‌లో ఇదే మొదటిసారి. ఇప్పుడే ఇలా ఉందంటే రేపు సినిమా విడుదలై ఈ పాట ఒరిజినల్ వీడియో రిలీజ్ అయితే ఇంకెన్ని రికార్డులను నమోదు చేస్తుందో చూడాలి మరీ.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :