ఆమెకు కొన్ని కోట్లు విలువ చేసే ఆస్తి ఇచ్చాను – శరత్ బాబు

Published on Feb 3, 2019 4:02 pm IST

సీనియర్ నటుడు శరత్ బాబు, ప్రముఖ సీనియర్ నటి రమాప్రభ ఇద్దరూ పెళ్లి చేసుకుని, కొన్నాళ్లు కలిసి ఉన్న తరువాత, వారి మధ్య కొన్ని అభిప్రాయబేధాలు వచ్చి విడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో రమాప్రభ చాలా ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ.. శరత్ బాబు నన్ను మోసం చేశాడని.. నా ఆస్తులను ఆయన కాజేశారని ఆమె ఆరోపిస్తూ వస్తున్నారు.

అయితే రమాప్రభ ఆరోపణల పై శరత్ బాబు ఏనాడూ పెదవి విప్పలేదు. కానీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన రమాప్రభ ఆరోపణల పై స్పందించారు. నాకు 22 ఏళ్ల వయసులో సరిగ్గా అవగాహన లేకుండానే ఆమెను పెళ్లి చేసుకున్నానని.. ఆ పెళ్లి నా జీవితం పై చాలా నెగిటివ్ ప్రభావాన్ని చూపిందని అన్నారు.

ఇక రమాప్రభను నేను మోసం చేశానని.. ఆమె ఆస్తులను కాజేశానని ఆమె చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన చెప్పుకొచ్చారు. తన ఆస్తిని అమ్మగా వచ్చిన డబ్బులతో.. రమాప్రభకు, ఆమె సోదరుడుకు ఆస్తులను కొని ఇచ్చానని.. వాటి విలువ ఇప్పుడు దాదాపు రూ.60 కోట్లకు పైగానే ఉంటాయని తెలిపారు. అలాగే చెన్నైలోని ఉమాపతి స్ట్రీట్‌లో ఆమెకు కొని ఇచ్చిన ఆస్తి విలువ కూడా ఇప్పుడు కొన్ని కోట్లు ఉంటుందని శరత్ బాబు చెప్పారు.

సంబంధిత సమాచారం :