రవితేజ సినిమాలో అన్నీ స్పెషలేనట

Published on Jun 10, 2021 8:06 pm IST

‘క్రాక్’ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన మాస్ మహారాజ్ రవితేజ వరుసగా మూడు సినిమాలని లైన్లో పెట్టి ఉంచారు. వాటిలో ‘ఖిలాడి’ సెట్స్ మీద ఉండగా ఇంకో రెండు సినిమాలు ఆరంభమయ్యే స్థితిలో ఉన్నాయి. వాటిలో ఒకటి శరత్ మండవ దర్శకత్వంలో ఉండనుంది. లాక్ డౌన్ లేకుండా ఉంటే ఈపాటికే ఇవి మొదలయ్యేది. కానీ బ్రేకులు పడ్డాయి. దీంతో ప్రాజెక్ట్ మీద అనేక అనుమానాలు, పుకార్లు మొదలయ్యాయి. దీంతో దర్శకుడు శరత్ మండవ స్పందించారు.

సినిమా మొలయ్యేవరకు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేమని, జూలై నుండి చిత్రం మొదలవుతుందని చెప్పుకొచ్చారు. అంతేకాదు సినిమా టైటిల్ అదిరిపోయేలా ఉంటుందని, ఫస్ట్ లుక్ మైండ్ బ్లోయింగ్ అనేలా, థీమ్ సాంగ్ అస్సలు ఊహించని రీతిలో ఉంటుందని, తాను కూడ ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, కానీ సిట్యుయేషన్ కరెక్ట్ కాదని అందుకే కాస్త ఎదురుచూడమని చెప్పుకొచ్చారు. దర్శకుడి మాటలు వింటుంటే మాత్రం సినిమా మీద అభిమానుల్లో అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఇకపోతే ‘ఖిలాడి’లో మిగిలి ఉన్న చిత్రీకరణను జూలై నెలకల్లా ఫినిష్ చేసే యోచనలో ఉన్నారు టీమ్.

సంబంధిత సమాచారం :