దసరా సందర్బంగా ఇంకో అడుగు ముందుకేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్

Published on Oct 8, 2019 11:53 am IST

దర్శకుడు అనిల్ రావిపూడి స్పీడ్ మామూలుగా లేదు. మహేష్ బాబుతో చేస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని చాలా వేగంగా పూర్తిచేస్తున్నారాయన. ఇప్పటికే షూటింగ్ పార్ట్ చాలా వరకు ముగించి ఈరోజు విజయదశమి సందర్బంగా ఇంకో అడుగు ముందుకువేసి డబ్బింగ్ మొదలుపెట్టారు. ఈ వేగం చూస్తే పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఎక్కువ సమయం తీసుకుని చిత్రాన్ని అన్ని విధాల ఖచ్చితంగా ఉండేలా చేయాలనేది టీమ్ ఉద్దేశ్యంగా కనబడుతోంది.

మొదటి నాలుగూ మీడియమ్ రేంజ్ సినిమాలే చేసిన అనిల్ రావిపూడి మహేష్ లాంటి స్టార్ హీరోతో, భారీ వ్యయంతో సినిమా చేయడం ఇదే తొలిసారి అయినా ఎక్కడా తడబడకుండా సినిమాను పూర్తిచేస్తుండటం నిజంగా విశేషమనే అనాలి. ఇకపోతే రష్మిక మందన్న కథానాయకిగా నటిస్తుండగా తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుండగా విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ బాణీలు సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More