మహేష్ సెట్స్‌లోకి అడుగుపెట్టబోయేది ఆరోజే

Published on Jun 18, 2019 10:37 pm IST

‘మహర్షి’ సినిమా విజయం సాధించడంతో వేడుకల్లో భాగంగా కుటుంబంతో కలిసి విదేశీ యాత్రకు వెళ్లిన మహేష్ తిరిగొచ్చారు. వచ్చిన వెంటనే తర్వాతి సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ ప్రొడక్షన్ పనుల్ని స్టార్ట్ చేశారు. స్క్రిప్ట్ దాదాపుగా పూర్తైపోవడంతో జూన్ 5వ తేదీ నుండి రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేయనున్నారు. అది కూడా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో కావడం విశేషం.

ఇందులో ప్రిన్స్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆయన కొత్త లుక్ ట్రై చేస్తున్నారు. ఇది కూడా అనిల్ రావిపూడి గత చిత్రాల తరహాలోనే పూర్తిస్థాయి యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. మొదటిసారి మహేష్ వినోదానికి పెద్ద పీఠ వేస్తూ సినిమా చేస్తుండటంతో ప్రేక్షకులు, అభిమానుల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. రష్మిక మందన్న కథానాయకిగా నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More