గుంటూరు,కృష్ణాలో సరిలేరు నీకెవ్వరు రికార్డు కలెక్షన్స్

Published on Jan 12, 2020 9:44 am IST

మహేష్ సరిలేరు నీకెవ్వరు గుంటూరు నందు రికార్డు ఓపెనింగ్స్ దక్కించుకుంది. ఈ చిత్రం మొదటి రోజు ఏకంగా 5.14 కోట్ల షేర్ తో ఆల్ టైం సెకండ్ హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. గుంటూరులో ఆల్ టైం సెకండ్ హైయెస్ట్ గా ఉన్న సైరా చిత్రాన్ని సరిలేరు నీకెవ్వరు దాటివేసింది. సైరా మొదటిరోజు గుంటూరు లో 5.06 కోట్ల వసూళ్లు అందుకుంది. బాహుబలి 2 మాత్రమే 6.18 కోట్ల కలెక్షన్స్ తో ఆల్ టైం టాప్ హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ఉంది. ఇక కృష్ణ డిస్ట్రిక్ట్ లో ఆల్ టైం టాప్ గా నిలిచింది. అక్కడ 3.07 కోట్ల ఫస్ట్ డే కలెక్షన్స్ తో సైరా పేరిట 3.02 కోట్లతో ఉన్న రికార్డు ని సరిలేరు నీకెవ్వరు సొంతం చేసుకుంది.

నేడు బన్నీ నటించిన అల వైకుంఠపురంలో విడుదల నేపథ్యంలో సరిలేరు నీకెవ్వరు థియేటర్స్ సంఖ్య తగ్గే అవకాశం కలదు. కాబట్టి మరి సెకండ్ డే సరిలేరు నీకెవ్వరు బాక్సాపీస్ పై ఎంతటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటించగా, విజయ శాంతి కీలక రోల్ చేశారు. దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :