మాస్ బిట్స్ తో ‘మైండ్ బ్లాక్’ చేసేశాడు !

Published on Dec 2, 2019 5:12 pm IST

‘సరిలేరు నీకెవ్వరు’ నుండి అదిరిపోయే మాస్ సాంగ్ వచ్చేసింది. అభిమానుల ఎదురుచూపులకు దేవి ఉత్సాహానిచ్చే ట్యూన్ తో మాస్ బిట్స్ తో రైమింగ్ పదాలతో ‘మైండ్ బ్లాక్’ చేసేశాడు. సినిమా పై ఉన్న భారీ అంచనాలకు తగ్గట్లుగానే.. ఈ సాంగ్ ఉంది. అప్పుడే ట్రెండింగ్ లోకెళ్ళిపోయిన ఈ ‘మైండ్ బ్లాక్’ సాంగ్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

మొత్తానికి ఈ సాంగ్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ టీం ప్రమోషన్స్ పనులను వేగవంతం చేసింది. ఇక ఇప్పటికే టీజర్ తో ఆడియన్స్ కు బ్రహ్మండమైన కిక్ ఇచ్చింది మహేష్ టీం. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న భారీ ఎత్తున విడుదలకానుంది. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం :

X
More