ఇళయదళపతి విజయ్ నటిస్తున్న సర్కార్ చిత్రం యొక్క కొత్త పోస్టర్ను కొద్దీ సేపటి క్రితం విడుదలచేశారు. ఇక పోస్టర్ లో సీఈఓ గెటప్ లో వున్న విజయ్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటుంది. పోస్టర్లో ఈచిత్రం యొక్క ఆడియో విడుదల తేదీని కూడా ప్రకటించారు. ముందుగా అనుకున్నట్లే ఈ చిత్రం యొక్క ఆడియో వేడుక అక్టోబర్ 2న చెన్నై లో జరుగనుంది. అయితే ఈ వేడుకకు వేదికను ఇంకా ఖరారు చేయలేదు. ఈచిత్రం యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతుంది.
పొలిటికల్ డ్రామా నేపథ్యంలో మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. ఎఆర్ రహమేన్ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్తో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈచిత్రం నవంబర్ 8న దీపావళి కానుకగా ప్రేక్షకులముందుకు రానుంది. ఇక విజయ్ – మురుగదాస్ కలయికలో వస్తున్న ఈ మూడవ చిత్రంఫై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘తుపాకి, కత్తి ‘చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.


