రేపు సర్కార్ సెకండ్ అప్డేట్ !

రేపు సర్కార్ సెకండ్ అప్డేట్ !

Published on Sep 19, 2018 8:00 PM IST

ఇళయదళపతి విజయ్ నటిస్తున్న ‘సర్కార్’ చిత్రంతో కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈచిత్ర టీం సినిమా ప్రమోషన్స్ ను సార్ట్ చేసింది. దాంట్లో భాగంగా సినిమానుండి మొదటి అప్డేట్ ను ఈరోజు రివీల్ చేశారు. ఈనెల 24న ఈచిత్రంలోని మొదటి సాంగ్ విడుదలచేయనున్నారు.

ఇక ఇప్పుడు తాజాగా రేపు ఈచిత్రానికి సంభందించిన సెకండ్ అప్డేట్ ను రివీల్ చేయనున్నారు. బహుశా ఈ అప్డేట్ ఆడియో విడుదల వేడుకకు సంభందించి ఉండవచ్చు అని సమాచారం. ఈచిత్ర ఆడియో వేడుక అక్టోబర్ 2న చెన్నైలో జరుగనుందని ఇటీవల వార్తలు వచ్చాయి.

సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈచిత్రానికి ఏఆర్ రహమెన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ‘కత్తి, తుపాకి’ చిత్రాల తరువాత మురుగదాస్- విజయ్ ల కలయికలో వస్తున్న ఈచిత్రం ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు