సర్కార్ తెలుగులో బ్రేక్ ఈవెన్ కావాలంటే అంత రాబట్టాలి !

Published on Oct 30, 2018 11:16 am IST

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన సర్కార్ తెలుగులో కూడా విడుదలవుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత అశోక్ వల్లభనేని ఈచిత్రం యొక్క తెలుగు వెర్షన్ హక్కుళ్లను 7కోట్ల కు దక్కించుకున్నారు. ఇక తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం యొక్క బిజినెస్ పూర్తయింది. ఈ చిత్రం తెలంగాణ ,ఆంధ్రాలో బ్రేక్ ఈవెన్ కావాలంటే 7.5 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టాలి.

విజయ్ మార్కెట్ పరంగా చూసుకుంటే ఇది కొంచెం ఎక్కువనే చెప్పాలి. కాకపోతే ప్రస్తుతం తెలుగులో పెద్ద సినిమా లేకపోవడం అలాగే ఇక్కడ కూడా ఈ చిత్రం 750 స్క్రీన్ లలో విడుదల కావడం సర్కార్ కు కలిసిరానుంది. ఇక ఈ చిత్రం తమిళనాడు లో 80కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని సమాచారం. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే అక్కడ విజయ్ కి వున్నా మార్కెట్ దృష్ట్యా ఈ మొత్తాన్ని రాబట్టడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. నవంబర్ 6న ఈ చిత్రం తెలుగు , తమిళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :