మరో మాస్ మైల్ స్టోన్ అందుకున్న ‘సర్కారు వారి’ బ్లాస్టర్.!

Published on Oct 27, 2021 9:01 am IST


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. చాలా కాలం తర్వాత మళ్ళీ పాత మహేష్ బాబుని చూడబోతున్నాం అనేదే ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుతూ వస్తుంది.

అయితే ఈ చిత్రం నుంచి ఎంతో కాలంగా ఎదురు చూస్తూ వచ్చిన టీజర్ ను చిత్ర యూనిట్ మహేష్ బర్త్ డే కి బ్లాస్టర్ పేరిట రిలీజ్ చెయ్యగా దీనికి భారీ లెవెల్ రెస్పాన్స్ వచ్చింది. మొట్టమొదటి 1 మిలియన్ లైక్డ్ రీజనల్ టీజర్ గా రికార్డు సెట్ చేసి భారీ వ్యూస్ ని కొల్లగొట్టింది.

మరి ఈ బ్లాస్టర్ రెస్పాన్స్ అక్కడితో ఆగలేదు ఇప్పుడు మరో మాస్ మైల్ స్టోన్ 40 మిలియన్ వ్యూస్ అందుకొని సాలిడ్ రికార్డు సెట్ చేసింది. మొత్తానికి మాత్రం ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఆడియెన్స్ ఎలా ఎదురు చూస్తున్నారో అనేదానికి ఇది శాంపిల్ అని చెప్పాలి.

ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :