నైజాంలో “సర్కారు వారి పాట” రెండు రోజుల వసూళ్ల వివరాలు.!

Published on May 14, 2022 10:53 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం మహేష్ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. ఇక అలాగే ఈ చిత్రం ఫస్ట్ డే నైజాం లో ఆల్ టైం నాన్ RRR వసూళ్లను ఓపెన్ చెయ్యగా ఇపుడు అక్కడ రెండో రోజు వసూళ్లకు సంబంధించి వివరాలు తెలుస్తున్నాయి.

ఇక్కడ రెండో రోజుకి గాను ఈ చిత్రం 5.2 కోట్ల రూపాయల షేర్ ని రాబట్టిందట. దీనితో ఈ సినిమా రెండు రోజులకి గాను 17.4 కోట్ల షేర్ ను అందుకొని అదరగొట్టింది. ఇక ఎలాగో టాక్ కూడా బానే ఉంది కాబట్టి ఈ శని, ఆదివారాల్లో కూడా ఈ చిత్రం మరింత స్ట్రాంగ్ వసూళ్లను అందుకుంటుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు.

సంబంధిత సమాచారం :