“సర్కార్ వారి పాట” సినిమాకు హైలెట్‌గా నిలిచేది అదేనా?

Published on Sep 19, 2021 3:00 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట”. మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. అయితే ఈ సినిమాలో విలక్షణ నటుడు సముద్రఖని నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాంక్ సెట్‌లో మహేశ్ బాబు, సముద్రఖని మధ్య క్రేజీ ఘర్షణ సన్నివేశాన్ని చిత్రీకరించారట.

అయితే ఈ సినిమాలో మహేశ్, సముద్రఖని ఒకరికొకరు సవాలు చేసుకునే అవకాశం సినిమాలో కీలక దశలో వస్తుందని, ఈ సన్నివేశం సినిమాకు పెద్ద హైలెట్‌గా నిలుస్తుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :