మరో భారీ మార్క్ అందుకున్న “సర్కారు వారి” మాస్ పాట.!

Published on May 29, 2022 11:05 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “సర్కారు వారి పాట”. మహేష్ కెరీర్ లో మంచి మోస్ట్ అవైటెడ్ గా వచ్చిన ఈ చిత్రం నుంచి హైలైట్ గా నిలిచిన అనేక అంశాల్లో ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ కూడా కూడా ఒకటి.

సంగీత దర్శకుడు థమన్ అందించిన ఈ సినిమా పాటలు అన్నీ హిట్ కాగా వాటిలో లాస్ట్ గా రిలీజ్ చేసిన మాస్ బీట్ మ మ మహేశా అయితే సూపర్బ్ రెస్పాన్స్ ని అందుకుంది. మరి లేటెస్ట్ గా అయితే ఈ సాంగ్ భారీ మార్క్ 50 మిలియన్ వ్యూస్ మార్క్ ని రీచ్ అవ్వగా దీనితో మన టాలీవుడ్ లో మరో మోస్ట్ ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ సాధించిన వీడియోగా ఇది నిలిచింది. ఇక ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :