మొదలైన మహేష్ వేలం పాట…మొదలైన “సర్కారు వారి పాట” షూటింగ్!

Published on Jul 12, 2021 6:05 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రం షూటింగ్ నేడే ప్రారంభం అయింది. అయితే షూటింగ్ కి సంబంధించిన విషయాలను తాజాగా చిత్ర యూనిట్ సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. దర్శకుడు పరశురామ్ హీరో మహేష్ బాబు కి సన్నివేశాన్ని వివరించే వర్కింగ్ స్టిల్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా చిత్ర షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు పూర్తి చేయగా, టీమ్ అందరికీ కూడా నెగటివ్ రావడం తో షూటింగ్ షురూ చేయడం జరిగింది.

అయితే పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :