లేటెస్ట్..”సర్కారు వారి” షూట్ ప్లాన్స్ ఇవే.!

Published on Jul 4, 2021 8:36 am IST

ఇప్పుడు మళ్లీ మన టాలీవుడ్ సినిమాలు షూటింగ్ లకు మరియు సినిమా విడుదలలకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు షూటింగ్ లు స్టార్ట్ చెయ్యగా రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాలు స్టార్ట్ కానున్నాయి. మరి వాటిలో సూపర్ స్టార్ మహేష్ అండ్ దర్శకుడు పరశురాం పెట్ల కాంబోలో ప్లాన్ చేసిన సాలిడ్ మాస్ మసాలా ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” కూడా ఒకటి.

దుబాయ్ లో ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు రెండో షెడ్యూల్ కి సిద్ధం అవుతుంది. అయితే ఈ నెక్స్ట్ షూట్స్ ఎక్కడెక్కడ ఉంటాయో అన్నది ఇప్పుడు తెలుస్తుంది. మన దగ్గర అయితే హైదరాబాద్, వైజాగ్ అలాగే గోవా ప్రాంతాల్లో షూటింగ్ ఉండగా ఆ తర్వాత అమెరికాలో కూడా ఒక షెడ్యూల్ ని మేకర్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

ఈ చిత్రం మొదలయ్యాక పక్కా ప్లాన్ ప్రకారం ఈ షూట్స్ జరగనున్నాయి. మరి భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే..

సంబంధిత సమాచారం :