‘దూకుడు’ వైబ్స్ ని గుర్తు చేస్తున్న “సర్కారు వారి ‘పాట”.!

Published on Oct 26, 2021 8:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన పలు చిత్రాల్లో మర్చిపోలేని హిట్ “దూకుడు” కూడా ఒకటి. మళ్ళీ పోకిరి సినిమా తర్వాత మహేష్ కి తన రేంజ్ హిట్ దూకుడు తో తగిలింది. అయితే ఈ సినిమాలో థమన్ ఇచ్చిన సాంగ్స్ కూడా పెద్ద హిట్ అయ్యాయి.

ఇక మళ్ళీ బిజినెస్ మెన్, ఆగడు తర్వాత “సర్కారు వారి పాట” ఈ కాంబో నుంచి వస్తుండడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా స్పెషల్ గా మారిన ఈ ఆల్బమ్ లో ఓ సాంగ్ షూట్ ఇప్పుడు స్పెయిన్ దేశంలో జరుగుతుంది. మరి దీనికి సంబంధించిన ఫోటో కూడా ఒకటి వైరల్ అవుతుంది.

ఇది చూస్తే దూకుడు లోని చార్ట్ బస్టర్ ‘గురువారం మార్చ్ 1’ వైబ్స్ గుర్తు రాక మానవు. మహేష్ చుట్టూతా ఇంగ్లీష్ అమ్మాయిలు ఒక డిఫరెంట్ డ్రెస్సింగ్ లో ఏదో బతిమాలుతున్నట్టు కనిపిస్తున్నారు. ఆ సాంగ్ లో కూడా కోరస్ లో వారే ఉంటారు. దీనితో ఆ మ్యాజిక్ మళ్ళీ ఈ సాంగ్ తో కూడా రిపీట్ అవ్వడం కన్ఫర్మ్ అనిపిస్తుంది. మరి సినిమా కూడా అంతకు మించిన హిట్టే అవుతుంది అని మేకర్స్ చెబుతున్నారు.

సంబంధిత సమాచారం :

More