మణికర్ణిక కోసం లెజెండరీ కొరియోగ్రాఫర్ !

మణికర్ణిక కోసం లెజెండరీ కొరియోగ్రాఫర్ !

Published on Sep 14, 2018 1:00 AM IST

manikarnika
స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలైన చిత్రం ‘మణికర్ణిక’. పోరాట యోధురాలు ‘రాణి లక్ష్మి భాయ్’ జీవిత చరిత్ర ఆదారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. అయితే కంగ‌నాకు, క్రిష్ కు మ‌ధ్య విభేదాలు వచ్చాయని, అందుకే కంగనానే డైరెక్షన్ చేస్తుందని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.

తాజాగా బాలీవుడ్ సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఈ చిత్రంలో ఓ ట్రేడిషనల్ సాంగ్ ని కంపోజ్ చేస్తున్నారట. కాగా సంగీత త్రయం శంకర్- ఎహసాన్- లాయ్ లు సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది . ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో విడుదల అవ్వనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు