శర్వానంద్ కి భారీ ఆపరేషన్, రెండు నెలల విశ్రాంతి

Published on Jun 18, 2019 9:01 am IST

హీరో శర్వానంద్ ఇటీవల షూటింగ్ లో ప్రమాదానికి గురైన సంగతి తెలిసింది. థాయిలాండ్ లో ’96’ మూవీ చిత్ర షూటింగ్ సందర్భంగా స్కై డైవింగ్ చేస్తున్న శర్వానంద్ లాండింగ్ సమయంలో తలెత్తిన సమస్యల వలన ఆయన భుజానికి బలమైన గాయమైంది. దీనితో ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకొని హాస్పిటల్ లో చేరారు.
తాజాగా శర్వానంద్ భుజానికి వైద్యులు శస్త్రచికిత్స చేశారంట. గాయంకొంచెం పెద్దది కావడం వలన దాదాపు 11 గంటలు సుదీర్ఘమైన ఆపరేషన్ జరిగిందట. రెండు నెలల విశ్రాంతి అవసరం అని చెప్పారట వైద్యులు.

ప్రస్తుతం శర్వానంద్ సమంత జంటగా సి.ప్రేమ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “96” మూవీతో పాటు,’స్వామి రారా’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో “రణరంగం” చిత్రాలలో నటిస్తున్నారు.శర్వానంద్ కి జరిగిన ఈ ప్రమాదం వలన ఇప్పుడు ఈ రెండు చిత్రాల విడుదల ఆలస్యమయ్యేలా కనబడుతుంది.

సంబంధిత సమాచారం :

X
More