శర్వానంద్ నెక్స్ట్ మూవీ అతనితోనేనా ?

Published on Jan 31, 2020 11:30 am IST

యంగ్ హీరో శర్వానంద్ సైలెంట్ గా సినిమాలకు సైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో నటించిన కొత్త చిత్రం ‘జాను’ ఫిబ్రవరి 7న విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమా షూట్ పూరయ్యేలోపే ‘శ్రీకారం’ అనే సినిమా స్టార్ట్ చేశారు. ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ కిశోర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే 30 శాతానికి పైగా షూటింగ్ ముగిసింది. ఈ చిత్రం కంప్లీట్ అయిన వెంటనే ఇంకో కొత్త చిత్రం స్టార్ట్ చేయడానికి శర్వా సిద్దంగా ఉన్నారు.

ఈ చిత్రాన్ని ‘నేను శైలజ, చిత్రలహరి’ ఫేమ్ కిశోర్ తిరుమల డైరెక్ట్ చేస్తారని వినికిడి. కిశోర్ తిరుమల ప్రజెంట్ రామ్ హీరోగా ‘రెడ్’ చిత్రం చేస్తున్నారు. శర్వా ‘శ్రీకారం’ ముగిసేలోపు ఈ చిత్రం కూడా పూర్తవుతుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కొత్త ప్రాజెక్ట్ మొదలుపెడతారట. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తారని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :