వరుణ్ తేజ్ సినిమాలో తమిళ సీనియర్ నటుడు !

Published on Apr 26, 2019 2:00 am IST

ఫిదా తరువాత కెరీర్ లో ఎఫ్ 2 తో మరో బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టాడు మెగా హీరో వరుణ్ తేజ్. ఈ సినిమా తరువాత ప్రస్తుతం వరుణ్ తేజ్ ,హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న వాల్మీకి చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈసినిమా షూటింగ్లో జాయిన్ అయ్యాడు. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జిగర్ తండా కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూర్తిగా డిఫ్రెంట్ లుక్ లో కనిపించనున్నాడు.

ఇక ఈ చిత్రం తరువాత వరుణ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో ఆయన బాక్సర్ గా కనిపించనున్నాడు. అందుకోసం ఇటీవల యూఎస్ లో బాక్సింగ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. త్వరలోనే ఈ చిత్రం లాంచ్ కానుంది. ఇక ఈ చిత్రంలో తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ ముఖ్య పాత్రలో నటించనున్నాడని సమాచారం.

సంబంధిత సమాచారం :