టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘రావు బహదూర్’ జూలై 3న రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు వెంకటేష్ మహా నటుడు సత్యదేవ్‌ను ఈ తరం కమల్ హాసన్ అంటూ పొగిడారు. అయితే, ఈ పొగడ్తలు తీవ్ర చర్చకు దారితీశాయి. లెజెండరీ నటుడు కమల్ హాసన్‌తో సత్యదేవ్‌ను పోల్చడంపై కొందరు నెటిజన్లు దర్శకుడిని విమర్శించారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ వివాదంపై సత్యదేవ్ రెస్పాండ్ అయ్యాడు. తన దర్శకుడు చేసిన వ్యాఖ్యలను ఆయన పూర్తిగా సమర్థించాడు. కమల్ హాసన్ గారిలా తాను కూడా ప్రోస్తేటిక్ మేకప్‌తో ఒక సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నానని, ఆ కోరిక ‘రావు బహదూర్’ చిత్రంతో నెరవేరిందని సత్యదేవ్ తెలిపాడు. గంటల తరబడి మేకప్ కోసం కూర్చునే సమయంలో తాను కమల్ హాసన్ గారి గురించి వెంకటేష్ మహాతో చర్చించానని చెప్పుకొచ్చాడు.
మహా చేసిన పోలిక తనపై ఉన్న అభిమానంతో అన్నదే కానీ, కమల్ సార్‌ను తక్కువ చేయడానికి కాదని.. కమల్ హాసన్ స్ఫూర్తితో పరిశ్రమలోకి ఒక నటుడు వచ్చాడని చెప్పడమే మహా ఉద్దేశమని సత్యదేవ్ స్పష్టం చేశాడు. ఏ దర్శకుడికైనా తన హీరోనే మెగాస్టార్ అని సత్యదేవ్ వ్యాఖ్యానించాడు. ఏదేమైనా ప్రస్తుతం ‘రావు బహదూర్’ సినిమా ప్రమోషన్స్ కంటే ఈ కామెంట్ వివాదమే బాగా వైరల్ అవుతుందని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.


