లాయర్ గా ఆసక్తి రేపుతున్న సత్యదేవ్ “తిమ్మరుసు” టీజర్.!

లాయర్ గా ఆసక్తి రేపుతున్న సత్యదేవ్ “తిమ్మరుసు” టీజర్.!

Published on Dec 9, 2020 5:00 PM IST

timmarasu

మన టాలీవుడ్ లో అపారమైన టాలెంట్ కలిగి ఉన్న వారికి మంచి గుర్తింపు వస్తుంది అనడానికి మంచి ఉదాహరణగా నిలిచే నేటి తరం యువ హీరోల్లో సత్యదేవ్ కూడా ఒకరు. తనదైన నటనతో ఎలాంటి పాత్రను అయినా సరే అవలీలగా పండించే ఈ టాలెంటెడ్ హీరో రీసెంట్ గా “ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య”తో మంచి బ్రేక్ అందుకున్నాడు. అలా ఇప్పుడు తాను చేస్తున్న మరో ఆసక్తికర ప్రాజెక్ట్ “తిమ్మరుసు” నుంచి టీజర్ మాస్ దర్శకుడు పూరి చేతుల మీదగా బయటకు వచ్చింది.

ఈ టీజర్ ను చూస్తే డీసెంట్ గా మరియు ఆసక్తికరంగా ఉందని చెప్పొచ్చు. లాయర్ గా కనిపిస్తున్న సత్యదేవ్ మంచి పవర్ ఫుల్ రోల్ నే చేస్తున్నట్టు అనిపిస్తుంది. లాయర్ వృత్తిలో కేసు జయాపజయాలను కాకుండా నిజాయితీగా న్యాయం గెలవడం కోసమే పని చేసే లాయర్ గా చేస్తున్నాడు. ఇదే లాయర్ లుక్ లో మరిన్ని షేడ్స్ జోడించి హీరోయిక్ రోల్ లో సత్యదేవ్ ఆకట్టుకునేలా ఉన్నాడని చెప్పాలి..

అయితే ఇలాంటి బ్యాక్ డ్రాప్ సినిమాలు అంటే మంచి ఛాలెంజింగ్ కేసులు తప్పనిసరి అలాంటివి టీజర్ లో చూపించలేదు కానీ ఏదో అస్సైన్మెంట్ మాత్రం ఉందని తెలుపుతున్నారు. అప్పు ప్రభాకరన్ అందించిన సినిమాటోగ్రఫీ అలాగే, శ్రీచరణ్ పాకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ లు మంచి ఇంప్రెసివ్ గా ఉన్నాయి. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేశ్‌ కోనేరు‌ తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై శృజన్ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు