తమన్నాతో సినిమా ఆగిపోలేదంటున్న హీరో

తమన్నాతో సినిమా ఆగిపోలేదంటున్న హీరో

Published on Oct 30, 2020 3:00 AM IST

కన్నడ హిట్ మూవీ ‘లవ్ మాక్ టైల్’ను తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాలు జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో స్టార్ నటి తమన్నా, టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరో హీరోయిన్లుగా ఫైనల్ అయ్యారు. చిత్రానికి ‘గుర్తుందా శీతాకాలం’ అనే టైటిల్ నిర్ణయించారు. టైటిల్ చాలా బాగుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో అమితమైన ఆసక్తి నెలకొంది.
సినిమా ఆడియో హక్కులను కూడ లీడింగ్ సంస్థ మంచి ధరకు కొనుగోలు చేసింది. కానీ ఇప్పుడు మాత్రం షూటింగ్ మొదలుకాకముందే సినిమా ఆగిపోయినట్టు వార్తలొస్తున్నాయి.

హీరో సత్యదేవ్ ఇటీవలే కొత్త సినిమాకు సైన్ చేసి షూటింగ్ కూడ మొదలుపెట్టారని, దీంతో ‘గుర్తుందా శీతాకాలం’కు ఆయన డేట్స్ కేటాయించడం కుదరలేదని అందుకే సినిమా ఆగిపోయిందని అన్నారు. కాసేపు బడ్జెట్ సమస్యల వలన నిలిచిపోయిందనే ప్రచారం కూడ జరిగింది. కానీ హీరో సత్యదేవ్ మాత్రం ఆ వార్తల్లో నిజం లేదని, సినిమా ఆగిపోలేదని, పర్ఫెక్ట్ షెడ్యూల్ ప్లాన్ చేసి త్వరలోనే షూట్ స్టార్ట్ చేస్తామని అంటున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని నాగశేఖర్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు