సవ్యసాచి ఫస్ట్ లుక్, రిలీజ్ డీటెయిల్స్ !
Published on Mar 3, 2018 2:55 pm IST

చైతు హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న “సవ్యసాచి” సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. బాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మర్చి 8న విడుదల చెయ్యబోతున్నారని సమాచారం. అలాగే సినిమాను జూన్ 14న విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

హీరో క్యారెక్టరైజేషన్ కు “సవ్యసాచి” అనే టైటిల్ యాప్ట్ అని చిత్ర వర్గాలనుండి వస్తోన్న వార్తా. మాధవన్ విలన్ పాత్రలో కనిపించబోతున్న ఈసినిమాలో భూమిక చైతు వదిన పాత్రలో నటిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు యువరాజ్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. ప్రేమమ్ సినిమా తరువాత నాగ చైతన్య, చందు మొండేటి చేస్తున్న సినిమా ఇదే అవ్వడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.

 
Like us on Facebook