షూటింగ్ పూర్తి చేసుకున్న సవ్యసాచి !

షూటింగ్ పూర్తి చేసుకున్న సవ్యసాచి !

Published on Sep 20, 2018 3:11 PM IST

Savyasachi

ఇటీవల శైలజారెడ్డి అల్లుడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ ను సాధించిన యువ సామ్రాట్ నాగ చైతన్య. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న సవ్యసాచి షూటింగ్ ఈ రోజుతో పూర్తిఅయింది. పోస్ట్ ప్రోడుక్షన్ వర్క్స్ కు ఇంకో నెల సమయం తీసుకొని చిత్రాన్ని నవంబర్ 2న ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు.

ప్రేమమ్ డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో నిధి అగార్వల్ కథానాయికగా నటిస్తుంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అక్కినేని అభిమానులు ఈచిత్రం ఫై భారీ ఆశలే పెట్టుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు