సవ్యసాచి టీజర్ టాక్ : కాన్సెప్ట్ అదిరింది !

Published on Oct 1, 2018 10:40 am IST

అక్కినేని అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్న ‘సవ్యసాచి’ టీజర్ కొద్దీ సేపటి క్రితం విడుదలైయింది. ఇక ఈటీజర్ చూస్తుంటే చైతు రొటీన్ కు బిన్నంగా అదిరిపోయి కాన్సెప్ట్ తో రానున్నాడని తెలుస్తుంది. తన మొదటి చిత్రం ‘కార్తికేయ’ చిత్రంతో ఇండస్ర్టీ ద్రుష్టి ని తన వైపు తిప్పుకున్న దర్శకుడు చందూ మొండేటి ఈ చిత్రాన్ని కూడా డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నాడు. ఈచిత్రం చైతుకు మాస్ ఇమేజ్ ను కట్టబెట్టేలా వుంది. ఇక లేట్ గా వచ్చిన కూడా ప్రేక్షకుల్లో అంచనాలు ఏమాత్రం తగ్గకుండా చేయడంలో ఈ టీజర్ కీలక పాత్రను పోషించింది.

ఇక ఈచిత్రానికి మాధవన్ పాత్ర కూడా మరో హైలైట్ కానుంది. ఆయన ఈచిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈచిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా కీలక పాత్రలో కనిపించనుంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈచిత్రం నవంబర్ 2న విడుదలకానుంది. త్వరలోనే ఈచిత్రం యొక్కఆడియో వేడుక ఫై క్లారిటీ రానుంది.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :