బాలయ్య-బోయపాటి సినిమా నుంచి ఆ హీరోయిన్ ఔట్..!

Published on Nov 21, 2020 9:09 am IST

నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌‌లో ముచ్చటగా మూడో సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ రోర్ టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. మాస్ డైలాగ్స్, ఫైట్స్‌తో బోయపాటి మరోసారి తన మార్క్ చూపించారు. ఒక షెడ్యూల్ కంప్లీటైన తర్వాత కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిందే.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలయ్య సరసన అఖిల్ ఫేమ్ సయేషా సైగల్‌తో పాటు కంచె ఫేమ్ ప్రగ్యా జైశ్వాల్ నటిస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే చివరి నిమిషంలో సయేషా సైగల్ సినిమా నుంచి తప్పుకోవడంతో ప్రగ్యా జైశ్వాల్ ఒక్కటే నటించబోతున్నట్టు తెలుస్తుంది. కంచె సినిమాతో ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ రోజు ఆమె బాలయ్యతో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీలోని సెట్‌లోకి అడుగుపెట్టనున్నారు. వీరిద్దరిపై నేడు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

సంబంధిత సమాచారం :