వరల్డ్ వైడ్ హిస్టరీ క్రియేట్ చేసిన “స్కామ్ 1992” సిరీస్.!

Published on Jun 12, 2021 12:00 pm IST

ఇప్పుడు మన దేశంలో కూడా ఓటిటి రంగం ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో చూస్తున్నాం.. మరి అందుకు తగ్గట్టుగానే మన నుంచి కూడా సాలిడ్ కంటెంట్ ప్రపంచ వీక్షకులకు అందిస్తున్నారు. అలా ఈ కంటెంట్ లో పలు వెబ్ సిరీస్ లకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి వాటిలో సెన్సేషనల్ హిట్ కాబడిన సిరీస్ “స్కామ్ 1992”. హర్షద్ మెహతా జీవిత చరిత్ర ఆధారంగా ప్రతీక్ గాంధీ మెయిన్ లీడ్ లో నటించిన ఈ సిరీస్ దేశ వ్యాప్తంగా గత ఏడాది సోనీ లైవ్ లో విడుదలై భారీ హిట్ అయ్యింది.

మరి ఈ హిట్ ఇప్పుడు వరల్డ్ వైడ్ హిస్టరీ నమోదు చేసినట్టు తెలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో ఉన్నటువంటి 250 టాప్ టీవీ షో, సిరీస్ లలో 9.6 రేటింగ్ ఐ ఎం డి బి రేటింగ్ లో నెంబర్ స్థానంలో నిలిచి అరుదైన ఘనతను సెట్ చేసింది. దీనితో ఈ సిరీస్ అందుకున్న ఈ ఘనతను చూసి దేశ వ్యాప్తంగా సినీ ప్రముఖులు సహా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

హన్సల్ మెహతా డైరెక్షన్ వహించిన ఈ సిరీస్ ఇంగ్లీష్ సిరీస్ “బ్రేకింగ్ బ్యాడ్” ను క్రాస్ చేసి ఈ ఘనత అందుకుంది. మరి అలాగే అచింత్ ఠక్కర్ ఇచ్చిన థీమ్ మ్యూజిక్ కి అయితే ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. అంత ఇంపాక్ట్ ను ఈ సిరీస్ సెట్ చేసింది.

సంబంధిత సమాచారం :