మెగా రీమేక్ కి షెడ్యూల్ డేట్ ఫిక్స్ !

Published on Jul 26, 2021 9:43 am IST

దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ రీమేక్‌ ను పట్టాలెక్కించేందుకు మెగాస్టార్ రెడీ అవుతున్నారు. కాగా ఈ సినిమా రెగ్యులర్ షెడ్యుల్ ను వచ్చే నెల ఆగస్టు 12 నుంచి స్టార్ట్ చేయనున్నారు. ఇప్పటికే మోహన్ రాజా ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేశారని.. మెగాస్టార్ కూడా స్క్రిప్ట్ విషయంలో పూర్తి సంతృప్తి చెందారని.. అందుకే ఈ సినిమాని లైన్ లో ముందుకు తీసుకువచ్చారట .

ఇక ఆగస్టు 12 నుండి జరగనున్న షెడ్యూల్ కోసం ప్రొడక్షన్‌ డిజైనర్‌ సురేష్‌ సెల్వరాజన్‌ నేతృత్వంలో ఓ భారీ సెట్‌ ను కూడా నిర్మించారట. ఇప్పటికే ఈ సెట్ కి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో హీరోయిజమ్ ఎలివేషన్స్ ఉన్న సీన్స్ మెయిన్ హైలైట్ గా ఉండేలా.. మెగా అభిమానులకు ఫుల్ జోష్ ని ఇచ్చేలా సినిమాని తెరకెక్కించాలని చూస్తున్నారు.

అలాగే తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్‌ లో మార్పులు చేశారట. ‘లూసిఫర్’లో మంజు వార్యర్, హీరోకి చెల్లి పాత్రలో నటించింది. అయితే మంజు వార్యర్ పాత్రలోనే సుహాసిని కనిపించబోతుంది.

సంబంధిత సమాచారం :