
‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ రాహుల్ రవీంద్రన్. రీసెంట్ గా ‘అలా ఎలా.?’ సినిమాతో హిట్ అందుకున్న రాహుల్ రవీంద్రన్ ఈ సారి యంగ్ హెరొఇ సందీప్ కిషన్ తో కలిసి నటించిన సినిమా ‘టైగర్’. సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాహుల్ రవీంద్రన్ తన పాత్ర గురించి చెబుతూ ‘నా పాత్ర చాలా ఫన్ ఉన్న పాత్ర, అలాగే చాలా కామ్ అండ్ మెచ్యూర్ గా బిహేవ్ చేసే పాత్ర. ఎలాంటి నిర్ణయమైనా కామ్ గా తీసుకుంటాడు. తన ప్రాణ స్నేహితుడు టైగర్ మరియు ప్రేమించిన అమ్మాయి కోసం ఏమన్నా చేసే పాత్ర. వీరి ముగ్గురి మధ్య ఏం జరిగింది అనేదే సినిమా’ అని తెలిపాడు.
అలాగే టైగర్ సినిమా హైలైట్స్ గురించి మాట్లాడుతూ ‘ ఈ సినిమాకి మేజర్ హైలైట్ అంటే ట్రీట్ మెంట్/ స్క్రీన్ ప్లే చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అందరికీ అర్థమయ్యే కమర్షియల్ సినిమా. అలాగే నేరేషన్ చాలా స్పీడ్ గా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఇప్పటివరకూ ట్రై యాంగిల్ లవ్ స్టొరీస్ చూసున్నారు కాని ముగ్గురి మధ్య ఫ్రెండ్ షిప్ – లవ్ అనే యాంగిల్ ని చూపించడం కూడా కొత్త పాయింట్’ అని రాహుల్ తెలిపాడు. ‘రన్ రాజా రన్’ ఫేం సీరత్ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా విఐ ఆనంద్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. ఠాగోర్ మధు – ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు.
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న రాహుల్ రవీంద్రన్ కి 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

