త్వరలో ప్రారంభం కానున్న ‘ఎస్‌డి’ షూటింగ్‌ !

త్వరలో ప్రారంభం కానున్న ‘ఎస్‌డి’ షూటింగ్‌ !

Published on Apr 3, 2019 5:41 PM IST

Bangaraju

‘బంగారి బాల‌రాజు’ ఫేం కరోణ్యా కత్రిన్‌, శ్రీజిత్‌ లావన్‌ జంటగా భాను ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ప్రణవి ప్రొడక్షన్స్‌ బేనర్స్‌ పై శ్రీసాయి అమృత ల‌క్ష్మి క్రియేష‌న్స్ సమర్పణలో గోదారి భానుచందర్‌, తిరుపతి పటేల్‌ సంయుక్తంగా పాలిక్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘ఎస్‌డి’ .కేరాఫ్‌ వెంచపల్లి’ ట్యాగ్‌లైన్‌.

ఈ చిత్రం యొక్క షూటింగ్ ఈ నెల‌లో స్స్టార్ట్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పాలిక్‌ మాట్లాడుతూ…‘‘1960 నుండి 1980 మధ్యలో జరిగిన యథార్థ సంఘటను బేస్‌ చేసుకుని ‘ఎస్‌డి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఓ గ్రామంలో నివ‌సించే శివుడు, దేవకి మధ్య స్నేహం మొదల‌వుతుంది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారుతుంది. ఈ క్రమంలో అదే గ్రామంలో ఒక దొర వీరి ప్రేమకు అడ్డుపడతాడు. ఆ దొరను ఎదిరించి వారి ప్రేమను ఎలా కాపాడుకున్నారు అనేది చిత్ర కథాంశం. ‘ఎస్‌ ’ అంటే శివుడు, ‘డి’ అంటే దేవకి …వీరిద్దరి పేరు వచ్చేలా `ఎస్‌డి` టైటిల్‌ పెట్టాం. ప్రేమ, ఫ్రెండ్‌షిప్‌, సెంటిమెంట్‌, ఎమోషన్‌ ఇలా అన్ని రకా ఎమోషన్స్‌ ఉన్నాయి. ప్ర‌స్తుతం వ‌స్తోన్న చిత్రాల‌కు భిన్నంగా మా చిత్రం ఉంటుంద‌ని న‌మ్మ‌కంగా చెప్ప‌గ‌లం. నిర్మాత‌లు కూడా ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నిర్మించ‌డానికి స‌హ‌క‌రిస్తున్నారని అన్నారు.

తాజా వార్తలు