మహేష్ దత్తత తీసుకున్న బుర్రిపాలెం లో నేటి నుండి కరోనా రెండవ డోస్!

Published on Jul 11, 2021 9:16 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని బుర్రిపాలెం గ్రామం ను దత్తత తీసుకున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇప్పటికే మహేష్ బాబు అక్కడి ప్రజలకి కరోనా వైరస్ వాక్సిన్ ప్రజలకు వేపించాడు. ఆంధ్రా హాస్పిటల్స్ యాజమాన్యం సహకారం తో అక్కడి వారికి పూర్తి స్థాయిలో మొదటి డోస్ ప్రక్రియ పూర్తి అయింది. తాజాగా నేటి నుండి బుర్రిపాలెం లో రెండవ డోస్ వాక్సినేశన్ ప్రక్రియ మొదలు కానుంది. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల తో పాటుగా తనకు తోచిన రీతిలో సేవ చేస్తున్న సంగతి తెలిసిందే. చిన్నారులకు గుండె ఆపరేషన్ ల నుండి ఇలాంటి సేవా కార్యక్రమాలను మహేష్ ఎన్నో చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో మహేష్ సరసన హీరోయిన్ గా కీర్తీ సురేష్ నటిస్తుంది. ఈ చిత్రానికి దర్శకత్వం పరశురామ్ వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :