రామోజీ ఫిల్మ్ సిటీలో ‘క్లాప్’ కొడుతున్న ఆది

Published on Oct 2, 2019 10:35 am IST

హీరో ఆది పినిశెట్టి వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ఒక ప్రత్యేమైన నటుడిగా రాణిస్తున్నారు. విలన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, హీరోగా ఆయన అన్ని విధాల పాత్రలలో కనిపిస్తూ అలరిస్తున్నారు. సరైనోడు,అజ్ఞాతవాసి చిత్రాలలో విలన్ గా చేసిన ఆది, రంగస్థలం, యూ టర్న్ వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసి ఆకట్టుకున్నారు. తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం క్లాప్. అథ్లెటిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆది స్పోర్ట్స్ పర్సన్ గా కనిపించనున్నారు.

కాగా ఈమూవీ తాజా షెడ్యూలు హైదరాబాద్ లో నేడు రామోజీ ఫిల్మ్ సిటీ నందు ప్రారంభం కానుంది . 50లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేకమైన సెట్ లో షూటింగ్ జరపనున్నారు. ఈ షెడ్యూల్ నందు ఒక పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారని సమాచారం. పృథ్వి ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో ఆది సరసన ఆకాంక్ష సింగ్ నటిస్తుంది. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More