సెకండ్ సింగిల్ కి సిద్ధమైన భీమ్లా నాయక్…మారని రిలీజ్ డేట్!

Published on Oct 5, 2021 7:58 pm IST


పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం లో రానా దగ్గుపాటి మరొక కీలక పాత్ర లో నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు విడుదల అయిన ప్రచార చిత్రాలు, మేకింగ్ వీడియో, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్, రానా దగ్గుపాటి వీడియో సినిమా పై భారీ అంచనాలు పెంచేశాయి. అయితే తాజాగా ఈ చిత్రం నుండి మరొక అప్డేట్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది.

ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్దమైంది. అక్టోబర్ 15 వ తేదీన అంత ఇష్టం అనే పాటను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ సైతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం మాత్రమే కాకుండా, యూ ట్యూబ్ లో సరికొత్త రికార్డ్ లను క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నిత్యా మీనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అంత ఇష్టం అనే సెకండ్ సింగిల్ వీరిద్దరి పై చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

అంతేకాక ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ తో ఇప్పటికే మహేష్ బాబు సినిమా వాయిదా పడటం తో పవన్ కళ్యాణ్ సినిమా వాయిదా పడుతుంది అని పలువురు భావించారు. అయితే జనవరి 12 వ తేదీన వచ్చే ఏడాది అనుకున్న విధంగా సంక్రాంతి బరిలో దింపేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :